Telangana | రూ.4,450 కోట్లతో సైలో టెర్మినల్స్ ఏర్పాటు

Telangana | రూ.4,450 కోట్లతో సైలో టెర్మినల్స్ ఏర్పాటు

Telangana | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను ఆధునీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం నిల్వ వ్యవస్థల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు.

రూ.4,450 కోట్ల పెట్టుబడులతో ఆధునిక సైలో టెర్మినల్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రి, ప్రాజెక్టు అమలుకు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్, వెదర్‌ప్రూఫ్, ప్యాడీ స్టోరేజ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఈ ప్రణాళికలో భాగంగా 47.5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యంతో సైలోల నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 82 సైలో టెర్మినల్స్ ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో ధాన్యం నిల్వ చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు.

రైతులు పండించిన ధాన్యాన్ని నాణ్యత కోల్పోకుండా భద్రపరచడం, నిల్వల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం, రవాణా ఖర్చులు తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలని మంత్రి పేర్కొన్నారు.