పొన్కల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

పొన్కల్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

మామడ, ఆంధ్రప్రభ:
మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో పటేల్ పుష్ప – అర్జున్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని స్థానిక సర్పంచ్ చిట్యాల లక్ష్మి రాజారెడ్డి, ఉప సర్పంచ్ పార్‌పెల్లి రాజారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు గృహ సౌకర్యం కల్పించడంలో ఈ పథకం ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు సుధాకర్ రెడ్డి, రాజు, వినోద్, లావణ్య, వీడీసీ అధ్యక్షుడు నరేష్ రెడ్డి, నాయకులు సల్కం శేఖర్, రెడ్డి నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.