బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భీమ్రావుకు సన్మానం

బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భీమ్రావుకు సన్మానం
ఉట్నూర్, ఆంధ్రప్రభ:
బంజారా సేవా సంఘ్ ఆల్ ఇండియా నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఉట్నూర్ ఐటీడీఏ రిటైర్డ్ ఈఈ రాథోడ్ భీమ్రావును సోమవారం ఘనంగా సన్మానించారు. ఉట్నూర్‌లోని ఆయన నివాసంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు, సంఘ నాయకులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బంజారా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ, రాథోడ్ భీమ్రావు గత 35 సంవత్సరాలుగా బంజారా ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భీమ్రావు వెంటనే స్పందించాలని సంఘ నాయకులు కోరారు. బంజారాలకు రావాల్సిన రిజర్వేషన్లు, పేద కుటుంబాలకు అవసరమైన సౌకర్యాలు, విద్యార్థులకు హాస్టళ్లలో సీట్లు, కళాశాలలలో సమస్యలు వంటి అంశాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడిగా భీమ్రావు బంజారా సమాజానికి న్యాయం చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ఆడే ప్రకాష్, సంజీవ్ నాయక్, ఉదారం దవిత్, సురేందర్ రాథోడ్, ప్రకాష్, లక్ష్మణ్, గోపాల్, రమేష్, వసంతరావు, విశ్వనాథ్, రవీందర్, విలాస్, దల్లాల్, జోవేందర్, దత్తరామ్, తదితరులు పాల్గొన్నారు.
