Prime Minister Modi | ఆర్థికంలో భార‌త్ జోరు..

Prime Minister Modi | ఆర్థికంలో భార‌త్ జోరు..

  • జీడీపీ వృద్ధిపై మోదీ హర్షం
  • 7.7% జీడీపీ గ్రోత్.. 140 కోట్ల భారతీయుల కష్టానికి ఫలితం
  • ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో యువతకు మరిన్ని అవకాశాలు..
  • ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై మరింత దృష్టి

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదుకావడం, అదే ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4) 7.8 శాతం వృద్ధి నమోదు కావడం భారత ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత బలాన్ని ప్రతిబింబిస్తోందని ఎక్స్ (ట్విట్ట‌ర్) వేధిక‌గా పేర్కొన్నారు.

ఈ వృద్ధి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలితమని, అలాగే 140 కోట్ల మంది భారతీయుల కృషికి నిదర్శనమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధిలో ప్రజల పాత్ర అత్యంత కీలకమని ఆయన తెలిపారు.

ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. అలాగే యువతకు మరిన్ని ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ప్రధాని స్పష్టం చేశారు. దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ఎలాంటి అవకాశాన్నీ వదులుకోదని మోదీ పేర్కొన్నారు.