అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్
గాంధీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
42 ద్విచక్ర వాహనాలు ,5 ఆటోలు స్వాధీనం

సారపాక, ఆంధ్రప్రభ : అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాల్వంచ డిఎస్పి (Palvancha DSP) హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని గాంధీ నగర్ లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రతి షాపును ప్రతి ఇంటిని నార్కోటి డాగ్ తో పోలీస్ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి గ్రామంలోని ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 5 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని హితవు పలికారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు చదువుతున్నారా లేదా ఎటువైపు వెళుతున్నారు అనే విషయాన్ని నిత్యం గమనిస్తూ ఉండాలని సూచించారు.

గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే తమ దృష్టికి తేవాలని కోరారు. ఐటీసీ పరిశ్రమ ఉండడం వలన ఇక్కడ రకరకాల ప్రజలు నివసిస్తున్నారని వారి పట్ల కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్, బూర్గంపహాడ్ ఎస్సై మేడాప్రసాద్ అదనపు ఎస్సై నాగబిక్షం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply