సమన్వయంతో పార్టీనీ బలోపేతం చేయండి..

సమన్వయంతో పార్టీనీ బలోపేతం చేయండి..

  • ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవి ప్రమాణ స్వీకారంలో
  • పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు

ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్,సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల నూతన అధ్యక్షుడిగా నియమితులైన బోగ్గుల శ్రీనివాసరెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించి, నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‌నూతనంగా బాధ్యతలు చేపట్టిన బోగ్గుల శ్రీనివాసరెడ్డి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చూడాలని అన్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఆ రానున్న ప్రతి ఎన్నికల్లో ప్రజలు మనసులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు.

మధిర నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా భట్టి విక్రమార్క కృషి చేస్తున్నారనీ, వారు చేస్తున్న అభివృద్ధిని విసృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోండబాల కోటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, యస్.సి సెల్ అధ్యక్షులు బోడ్డు బోందయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వెజండ్ల సాయి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, గోవర్థన్ రెడ్డి, మూడుమూంతల గంగారాజు, చిట్టిబాబు, యరమాల పూర్ణ చంద్ర రెడ్డి,నవీన్ రెడ్డి, దేవరకొండ రాజీవ్ గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply