Telangana | కుల గణన దేశానికే మార్గ ద‌ర్శ‌కం – రేవంత్ రెడ్డి

అన్ని రాష్ట్రాల‌లోనూ స‌ర్వేకు వ‌త్తిళ్లు
కుల గ‌ణ‌న‌తో బిసి, ఎస్సీ, మైనార్టీల‌కు న్యాయం
సుప్రీం కోర్టు సూచ‌న‌ల‌కు అనుగుణంగా రిజర్వేష‌న్ లు
మీడియాకు వివ‌రాలు అందించిన రేవంత్ రెడ్డి .

హైద‌రాబాద్ – కుల గణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని, అన్ని రాష్ట్రాల్లో కూడా కుల గణన చేయాలని డిమాండ్ రాబోతోందని తెలిపారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి . ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. భవిష్యత్‌లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి రిఫరెన్స్ అవుతుందని పేర్కొన్నారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీలోని త‌న ఛాంబ‌ర్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తమ ప్రభుత్వమే ఈ గణన చేపట్టిందని, 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో, ఎవరు చేసినారో తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగానే కుల గణనను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. కుల గణన ఆధారంగానే సీట్ల కేటాయింపు, పదవుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందులో క్రిమిలేయర్ విధానం అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.

ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సీఎం అన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే తమ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని, మిగిలిన విషయాలకు తావులేదని స్పష్టం చేశారు. కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, భవిష్యత్‌లో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Leave a Reply