ఎస్‌ఐఆర్‌ 100 శాతం పూర్తి చేసిన బీఎల్‌వోలకు ఘన సన్మానం

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అభినందనలు

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం కొల్లూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన బీఎల్‌వోలను గ్రామ సర్పంచ్ సింగారం సువర్ణ శ్రీనివాస్ గురువారం ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో బీఎల్‌వోలు చూపిన కృషి ప్రశంసనీయమని అన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆనంద్‌రాజు, నాయకులు రవికుమార్, సింగారం శ్రీనివాస్, భీమప్ప, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.