నూతన పెట్రోల్ బంకును ప్రారంభించిన ఐజి కమలహాసన్ రెడ్డి

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి ఫిల్లింగ్ స్టేషన్ (హెచ్‌పీ పెట్రోల్ బంక్)ను ఐజీ ఎఫ్ పోలీస్ కమలహాసన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ యజమాని పటేల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఎదిర, పాలకొండ, హౌసింగ్ బోర్డ్, భూత్పూర్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఇంధనం కోసం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం ఈ పెట్రోల్ బంక్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు, వాహనదారులకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని చెప్పారు.

వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన స్నేహితులు, బంధువులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.