సైకిళ్లపైనే సభా మందిరానికి..

సైకిళ్లపైనే సభా మందిరానికి..

శారీరక దారుఢ్యంపై జిల్లా ఉన్నతాధికారుల వినూత్న ప్రచారం

​ఆంధ్రప్రభ, శ్రీకాకుళం: పర్యావరణ పరిరక్షణ, శారీరక దారుఢ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ ఈ సోమవారం కూడా సైకిల్ పైనే జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమానికి చేరుకున్నారు. ​వారి క్యాంపు కార్యాలయాల నుండి సైకిళ్లపై నేరుగా జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. అక్కడ ప్రజా సమస్యల అర్జీలను స్వీకరించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​ కార్యక్రమం ముగిసిన తర్వాత అధికారులిద్దరూ తిరిగి తమ తమ క్యాంపు కార్యాలయాలకు సైకిల్ పైనే ప్రయాణమయ్యారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు, ఇంధన పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే జిల్లా ఉన్నతాధికారులు ఇలా సైకిల్ పై మూడు సోమవారాలుగా ప్రయాణించడం విశేషం.