రాజగోపురం పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

నాణ్యతతో పనులు పూర్తి చేసి బ్రహ్మోత్సవాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రాజగోపురం నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సోమవారం పరిశీలించారు.

ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారితో కలిసి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి, అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఆలయ రాజగోపుర నిర్మాణం భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా, శాస్త్రోక్తంగా, నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి, పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మాగనూర్ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వాకిటి హన్మంతు, అంజి తదితరులు పాల్గొన్నారు.