HYD | కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మళ్లింపు ట్రయల్..

HYD | కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మళ్లింపు ట్రయల్..
HYD | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలపై అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ మళ్లింపుపై నిన్న ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ ట్రయల్ ద్వారా ట్రాఫిక్ మళ్లింపుతో ఏర్పడే సమస్యలు, ప్రయాణికులకు కలిగే ఇబ్బందులపై అధికారులు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. ట్రాఫిక్ ప్రవాహం, మార్గాల సామర్థ్యం వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు.
అన్ని నివేదికలను పరిశీలించిన తర్వాతే ట్రాఫిక్ మళ్లింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. అప్పటివరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ యథావిధిగా కొనసాగనుంది.
