India election analysis | మారుతున్న రాజకీయ సమీకరణాలు

India election analysis | మారుతున్న రాజకీయ సమీకరణాలు
India election analysis | బెంగాల్ ఫలితాల్లో దాగిన రాజకీయ సంకేతాలు
ప్రజాస్వామ్యంపై ఎన్నికల ప్రభావం
దక్షిణాదిలో కాంగ్రెస్‌కు బలమైన పట్టుకోట
తమిళనాడులో విజయ్ రాజకీయ ఎంట్రీ ప్రభావం
బెంగాల్‌లో హిందూత్వ రాజకీయాల వ్యూహం
India election analysis | ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల ప్రాముఖ్యం ఏమిటి? ఈ ఫలితాలను సాధారణంగా పోల్చి చెప్పడం సులభం కాకపోవచ్చు. బెంగాల్లో ఫలితాలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అయితే, 2029 సాధారణ ఎన్నికలు ఇలాగే ఉంటాయని చెప్పలేం. 2027లో ఏడు అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌లు కూడా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను రాజకీయంగా పరిశీలిస్తే, 2029లో జరిగే సాధారణ ఎన్నికలకు బదులు వచ్చే ఏడాది జరిగే రాష్ట్రాల ఎన్నికలకు వీటిని అన్వయించుకోవచ్చు. ఇందుకు సంబంధించి నాలుగు విశ్లేషణలు చేయవచ్చు.
ప్రజాస్వామ్యంపై కొత్త చర్చ
మొదటిది: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు భారత్ ఎన్నికల నిరంకుశత్వం కాదని రుజువు చేస్తున్నాయి. ఎన్నికలు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మారుస్తున్నాయంటే, భారత్లో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధమైనవేనని అంగీకరించక తప్పదు. నాల్గింటిలో మూడు ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగాయని చెప్పవచ్చు. బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వల్ల లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోయారు. వీరిలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీకి ముస్లింల ఓట్లు 2014లో 8 శాతం మధ్యలోనే పడ్డాయి. అమెరికాలో ఓటర్ల అణచివేత ఉంది. నల్లజాతి వారిని అణచివేస్తారు. వారి శాతం 10 వరకూ ఉంటుంది. నల్లజాతీయులు రిపబ్లికన్ అభ్యర్థులకు ఎప్పుడో కానీ ఓటు వేయరు. అసోంలో పరిస్థితి విలక్షణంగా ఉంటుంది.

అసోంలో 30 శాతం మైనారిటీల ప్రాబల్యం గల నియోజకవర్గాల సంఖ్య 20కి తగ్గింది. అధికారంలో కొనసాగడానికి ఆధునిక ప్రభుత్వాలు ఎన్నికలను క్రమబద్ధం చేయడం ప్రారంభించాయి. ఒక్కోసారి అవి పడిపోతుంటాయి. హంగేరీలో విక్టర్ ఆర్బాన్‌ను అధికారం నుంచి తొలగించారు. బెంగాల్లో మూడు సార్ల నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు Mamata Banerjee ను ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకుని ఆమెను ఓడించారు. ఆమె ఓటమికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఆమె పాలన పట్ల ప్రజల్లో పేరుకున్న అసంతృప్తి. రెండోది ఎస్ఐఆర్ వల్ల ఓటర్ల సంఖ్య తగ్గిపోవడం. అయితే, ఒక్క ఎస్ఐఆర్ వల్లనే ఆమె ఓడిపోయిందంటే సరికాదు. ఆమె పాలనలో ప్రజలు అనేక కష్టాలను అనుభవించారు. అన్నీ కలిసి ఆమె ఓటమికి కారణమయ్యాయి.
దక్షిణాదిలో కాంగ్రెస్ బలం
కేరళ దక్షిణాది కంచుకోట: నేను చెప్పదల్చుకున్న రెండో విషయం ఏమిటంటే, దక్షిణాదిన ఐదు రాష్ట్రాల్లోనూ మూడింట కాంగ్రెస్ చేతుల్లో ఉన్నాయి. కర్నాటక, తెలంగాణ, కేరళ. ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లలో అధికార భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.
దక్షిణాదిన కాంగ్రెస్ పరస్పర విరుద్ధమైన పరిస్థితిని కలిగి ఉంది. దక్షిణాదిన చైనా వృద్ధిరేటును పోలి ఉంది. పూర్వం నుంచి కాకపోయినా, కనీసం 2000 సంవత్సరం నాటి నుంచి అని చెప్పవచ్చు. కాంగ్రెస్ ఢిల్లీ రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహించలేకపోతున్నది. దక్షిణాదిన నాల్గవ వంతు పార్లమెంటరీ సీట్లను కలిగి ఉంది. ఉత్తరాదిన, పశ్చిమాన కాంగ్రెస్ బలాన్ని పెంచుకోవాల్సి ఉంది.

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభావం
మూడో విషయం ఏమిటంటే: తమిళనాడులో విజయ్ విజయం ప్రాముఖ్యమైనది. మెగాస్టార్‌గా పేరొందిన సినీనటుడు Vijay తండ్రి క్రైస్తవుడు, తల్లి హిందువు. విజయ్ క్రైస్తవ మతాన్ని అవలంబించకపోయినా, పుట్టుక రీత్యా క్రైస్తవుడు. తమిళ రాజకీయాల్లో మతానికి పెద్ద ప్రాధాన్యం లేదు. బీజేపీ మైనారిటీ వ్యతిరేక వైఖరి విజయ్ విజయాన్ని దెబ్బతీయలేకపోయింది. అంతేకాక, తమిళనాడులో బీజేపీ ఎదగలేకపోతున్నది.
వైవిధ్యం అనేది భారత సాంస్కృతిక, రాజకీయ జీవన విధానంలో భాగం. తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు అసోం, బెంగాల్ ఫలితాలకు భిన్నమైనవి. భారత్లోని సామాజిక వైవిధ్యం జాతీయ సమైక్యతకు అవరోధంగా ఉందని బీజేపీ భావిస్తోంది. పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా యూరప్‌లో మాదిరిగా ఒకే జాతిగా పరిఢవిల్లడానికి అడ్డుగా ఉందని భావిస్తోంది.
బెంగాల్‌లో హిందూత్వ రాజకీయాల ప్రభావం
చివరగా, పశ్చిమ బెంగాల్ గురించి ప్రస్తావిస్తాను. హిందూత్వవాదులు బెంగాల్లో విజయంపై మొదటి నుంచి దృష్టిని కేంద్రీకరించారు. బెంగాల్లో హిందూ జాతీయవాదం బెంగాల్లోనే పుట్టిందని బీజేపీ విశ్వాసం. బంకించంద్ర చటోపాధ్యాయ తన రచనలతో హిందువులను ఆకర్షించారు. ముఖ్యంగా వందేమాతరం గేయం హిందువులను ఉత్తేజపరిచిందని వారి నమ్మకం. అంతేకాకుండా బీజేపీకి మాతృక అయిన భారతీయ జనసంఘ్‌ను స్థాపించిన డాక్టర్ Syama Prasad Mukherjee బెంగాల్‌కు చెందినవారు. ఈ రెండు విషయాలను ప్రధాని Narendra Modi తన ప్రసంగంలో ప్రస్తావించారు. బెంగాల్లో బీజేపీ విజయంతో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆత్మ శాంతిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇక విషయం ఏమిటంటే, బెంగాల్లో ముస్లింలు 30 శాతం ఉన్నారు. మతపరమైన సమీకరణ జరగనిదే బెంగాల్లో బీజేపీ గెలవలేదు. అందుకే హిందూ జాతీయవాదాన్ని గురించి ఎక్కువగా ప్రచారం చేసింది. కాశ్మీర్, అసోం, ఇప్పుడు బెంగాల్లో హిందువులను సమీకరించనిదే గెలవలేమని ఆ పార్టీ నమ్ముతోంది. కేరళలో అలా కాదు. కేరళలో మతపరమైన వైవిధ్యం ఉంది. అలాగే, తమిళనాడులోనూ హిందూ, ముస్లిం ఐక్యత గురించి స్పష్టత లేదు. బీజేపీ బెంగాలీలకు నచ్చజెబుతూ వస్తోంది. బెంగాల్లో స్వాతంత్య్రానంతరం జరిగిన మత కలహాలకు జాతిపిత Mahatma Gandhi కోల్‌కతాలో అంతర్యుద్ధం రాకుండా ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ విధంగా హిందూ, ముస్లిం ఐక్యత కోసం పాటుపడ్డారు. ప్రజాస్వామ్య క్షేత్రం పరిధిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే, దేశంలో ఒక ప్రాంతంలో మతపరమైన విజయం కనిపిస్తోంది. వైవిధ్యభారతం గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది.
— అశుతోష్ వార్ష్నీ, బ్రౌన్ యూనివర్శిటీ ప్రొఫెసర్
