HYD | కేటీఆర్‌పై దానం ఆగ్రహం

HYD | కేటీఆర్‌పై దానం ఆగ్రహం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలూ ఒక్కటేనని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ, బీఆర్ఎస్, కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన బీఆర్ఎస్ఎల్పీ భేటీకి తనను ఎందుకు పిలవలేదని దానం నాగేందర్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కాలేదని కేసీఆర్‌కు ఇబ్బంది లేదని, అయితే సీఎం పదవి పోయిందని కేటీఆర్‌కు చాలా ఇబ్బంది ఉందన్నారు. తనపై బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేసింది? అని దానం నాగేందర్ అన్నారు. తాను ఎంపీగా ఓడిపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ అపవిత్ర కలయికే అని దానం నాగేందర్ అన్నారు.
