Amit Shah | ఏపీకి రూ.341 కోట్లు

Amit Shah | ఏపీకి రూ.341 కోట్లు

Amit Shah | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఇవాళ‌ జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ సహా 6 రాష్ట్రాలకు రూ.1,913 కోట్ల అదనపు నిధుల విడుదలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. 2025లో వరదలు, మొంథా తుఫాను నష్టానికి సాయంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. గుజరాత్‌కు రూ.778 కోట్లు, ఏపీకి రూ.341 కోట్లు, జమ్మూకశ్మీర్‌కు రూ.330 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.288 కోట్లు, నాగాలాండ్‌కు రూ.158 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.15 కోట్లు అందనున్నాయి.