Under 19 World Cup | సెమీస్ లో ఇంగ్లండ్ ను తక్కువ స్కోర్ కు క‌ట్ట‌డి చేసిన భార‌త్

కౌలాలంపూర్ : మహిళల అండర్-19 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ను భార‌త్ త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్దారిత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో పరునిక సిసోదియా, వైష్ణవీ శర్మ మూడేసి వికెట్లతో విజృంభించగా.. ఆయూష్ శుక్లా రెండు వికెట్లతో రాణించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ పెర్రిన్ 45, కెప్టెన్ నోర్గోవ్ 30 పరుగులు చేశారు. మిగిలిన వారంతా త‌క్కువ స్కోర్ల‌కే వెనుతిరిగారు..

Leave a Reply