భర్త కిరాతకం
భర్త కిరాతకం
- భార్య మెడ కోసి పరార్
- చావుబతుకుల్లో మహిళ
(ఆంధ్రప్రభ, మచిలీపట్నం) : ఉన్మాదిగా మారిన భర్త అతి కిరాతకంగా భార్యను మెడను (Husband Attacks Wife) కోశాడు. భార్యాభర్తలకు ఇరువురికి గత నాలుగు నెలల కిందట విడాకులు మంజూరు కాగా, విడాకులు ఇవ్వటంతో భార్యపై కోపం పెంచుకున్న భర్త శ్రీరామరాజు శుక్రవారం భార్యను హతమార్చాలనే పక్కా పథకంతో పూటుగా మద్యం సేవించి సర్కిల్ పేట (Circle Peta) లోని భార్య ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా, అతి కిరాతకంగా కత్తితో దాడి చేసాడు.
విచక్షణ రహితంగా కత్తితో దాడి (Knife Attack) చేయడంతో పద్మ తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన పద్మను కుటుంబ సభ్యుల చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత మహిళ పద్మ (Padma) కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి ఇనకుదురుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
