మండలంలో హెచ్ పీవీ వ్యాక్సిన్ టీకా ప్రారంభం

వేంసూరు, ఆంధ్రప్రభ ; గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కట్టడి చేసేందుకు హెచ్ పివి (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ టీకా కార్యక్రమాన్ని తహశీల్దార్ మాణిక్ రావు, సర్పంచ్ మహ్మద్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండిన బాలికలు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కట్టడి చేసేందుకు హెచ్పిబితేగా ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల పరిధిలో అర్హత కలిగిన ప్రతి బాలిక వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైన వ్యాక్సిన్ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ ఇందు ప్రియాంక, డాక్టర్ శ్రీవిద్య, సిహెచ్ఓ వెంకట నారాయణ, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ తో పాటు బాలికలు, వారి తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.