పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన చిన్న మల్లయ్య..
వినుకొండ, ఆంధ్రప్రభ : మహిళపై అత్యాచారం ఆరోపణల కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చిన్నమల్లయ్య శుక్రవారం తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. లొంగుబాటు అనంతరం పోలీసులు ఆయనను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మీడియా ముందర ప్రవేశ పెట్టకుండా నేరుగా వాట్సాప్ గ్రూపులో ప్రెస్ నోట్ పెట్టి చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచారు. చిన్న మల్లయ్య వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్, పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వహించారు.
బ్రాహ్మణపల్లికి చెందిన మహిళ ధనలక్ష్మి అత్యాచారం చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా బెయిలు లభించకపోవడంతో పోలీసులు ఎదుట నింగిపోయాడు. అలాగే చిన్న మల్లయ్యను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
