ఘనంగా హోలీ వేడుకలు

ఘనంగా హోలీ వేడుకలు

  • జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
  • పాత్రికేయులు, సిబ్బందితో కలిసి నృత్యం చేసిన ఎస్పీ

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : రంగుల పండుగ హోలీని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అధికారులు, సిబ్బంది, పాత్రికేయ మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధికారులతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. పండుగ సందర్బంగా మాట్లాడుతూ హోలీ స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే పర్వదినమని పేర్కొన్నారు.

ప్రజలు పండుగను శాంతియుతంగా, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షించారు. పండుగ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.