Brain stroke| సంకేతాలను విస్మరించొద్దు

Brain stroke| సంకేతాలను విస్మరించొద్దు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ప్రాణాలకే ప్రమాదం. దీని లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా అవసరం. మెదడుకు రక్త సరఫరా తగ్గడం, అంతరాయం కలిగించడం వల్ల మెదడు కణాలు చనిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. త్వరగా దీనిని గుర్తిస్తే మెదడు దెబ్బతినే అవకాశాలను తగ్గించొచ్చు. అయితే ప్రజలు తరచుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు ముందు కనిపించే సంకేతాలను విస్మరిస్తారు. కానీ ఈ సంకేతాలు ప్రాణాలను కాపాడటానికి మొదటి అవకాశం. అవగాహన, సకాలంలో వైద్య సహాయంతో బ్రెయిన్ స్ట్రోక్ నుంచి బయట పడొచ్చు. స్ట్రోక్ వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- లక్షణాలు..
- స్ట్రోక్ వస్తే సాధారణంగా ముఖం ఒక వైపు వంకరగా అవుతుంది.
- నవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఒక వైపు చిరునవ్వు వంకరగా కనిపిస్తుంది.
- చేతులు, కాళ్ళలో తిమ్మిరి: శరీరం ఒక వైపున, ముఖ్యంగా చేతులు లేదా కాళ్ళలో అకస్మాత్తుగా తిమ్మిరి లేదా బలహీనత వస్తుంది.
- ఒక్కసారిగా కళ్లు మసకబారడం, ఒక కంటితో సరిగా కనిపించకపోవడం లేదా రెండు ప్రతిబింబాలు కనిపించడం.
- ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా తల తిరగడం, నిలబడలేకపోవడం, నడుస్తున్నప్పుడు తూలిపోవడం సంకేతాలు.

నివారణకు ఇలా చేయండి..
- కనీసం ప్రతి 6-8 నెలలకు ఒకసారి బీపీని తనిఖీ చేసుకోండి.
- ఎప్పటికప్పుడు గుండె మరియు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
- ధూమపానం, మద్యం మానేయడం మంచిది.
- మంచి ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోండి.
- సమయానికి.. సరిపోను నిద్ర పోవాలి
- ఉప్పు వాడకాన్ని తగ్గించండి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి.
- స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.

