ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన

99 రోజుల కార్యాచరణలో భాగంగా సమావేశం

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా గూడూరు మద్య నిషేధం , ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆబ్కారీ సీఐ బిక్షపతి ఆదేశాల మేరకు అబ్కారి ఎస్ఐ రాజేశ్వరి హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం… జీవితాన్ని కాపాడుకుందాం అంటూ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మీ పరిసరాల్లో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, సేవిస్తున్నా వెంటనే మాకు సమాచారం ఇవ్వండని ఎస్ఐ రాజేశ్వరి పిలుపునిచ్చారు.మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ కానిస్టేబుళ్లు వీరస్వామి, శ్రీనివాస్, చందు కళ్లుగీత కార్మిక మండల అధ్యక్షులు బబ్బురు ఉప్పలయ్య గౌడ, సంఘం సోసైటీ అధ్యక్షులు గంధసిరి యాకన్నా , సొసైటీ ఉపాధ్యక్షులు గంధం శ్రీనివాస్, సంతోష్, విజేందర్, రాజు రమేష్, వెంకటేశ్వర్లు, స్వామి, సతీష్ వెంకన్న మజీద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.