Rs.50 crore | నమ్మకండి..ఆగం అవుతాం.!

Rs.50 crore | నమ్మకండి..ఆగం అవుతాం.!

  • పదవులు, పథకాలు అమ్ముకుని ప్రజలను మోసం చేసినవారు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారు.
    -15 ఏళ్ల పాలనలో ఘన్‌పూర్‌కు చెప్పుకోదగ్గ పనులు జరగలేదు.
  • ఘన్‌పూర్‌కు ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీ తెచ్చాను..
  • అభివృద్ధికి రూ.50కోట్ల మంజూరు చేయించాను..
  • రూ.7 కోట్ల పనులకు శంకుస్థాపనతో అభివృద్ధి మొదలైంది
  • వారంలోనే మరో రూ.11 కోట్ల పనులకు శంకుస్థాపన జరగనుంది
  • మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Rs.50 crore | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్ర‌ప్ర‌భ : స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలో రూ.7కోట్ల(Rs.7 crore) రూపాయలతో పలు కాలనీలలో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వా న్ భాషాతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మాట్లా డారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే స్టేషన్ ఘన్ పూర్ ను మున్సిపాలిటీ చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం ఘన్ పూర్, శివునిపల్లి, చాగల్ గ్రామాలను కలిపి స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసినట్లు అందుకు సంబందించి 25జనవరి 2025 రోజున ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిం దని తెలిపారు.

-15ఏళ్లలో ఘన్ పూర్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు:

Rs.50 crore |

గత 15ఏళ్లుగా ఘన్ పూర్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కడియం అన్నారు. అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజిలు, విద్యుత్, త్రాగు నీరు సమ స్యల పరిష్కారానికి రూ.50కోట్ల(Rs.50 crore)తో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తే 29 సెప్టెంబర్ 2025 నాడు స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిం దనీ, ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రం(State)లోని ఏ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వలేదని అన్నారు.

అందులో భాగంగానే రూ. 7కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, మరో 11కోట్ల పనులకు వారం రోజు ల్లో శంకుస్థాపన చేసుకుంటామని తెలిపారు. ఈ రూ.11కోట్ల పనులలో లైబ్రరీ, మున్సిపాలిటీ కార్యాలయం, ఇంటిగ్రెటెడ్ మార్కెట్ వంటి పను లు ఉన్నాయని వివరించారు. మున్సిపాలిటీకి మంజూరు అయిన 50 కోట్ల పనులను సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

Rs.50 crore |

వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి మరో 50కోట్లు మంజూరు తీసు కువస్తానని వెల్లడించారు. నియోజకవర్గాని(Constituency)కి మరో 3,500 ఇందిరమ్మ ఇల్లు రానున్నాయని అందులో మున్సిపాలిటీలోని 18వార్డులకు వార్డుకు 25చొప్పున మొత్తం 450ఇందిరమ్మ ఇళ్లను స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీకి మంజూరు చేస్తానని తెలిపారు. ప్రతీ క్షణం నియోజక వర్గ అభివృద్దే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నాని అందుకు ప్రజల సహకారం కావాలని కోరారు.

  • అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు.. అభివృద్ధి పనులు చేయలేదు:
Rs.50 crore |

కొంత మంది చాలా మాటలు మాట్లాడుతున్నారని కానీ పైసా పని చేయడం చేతకాదని ఎమ్మెల్యే విమర్శించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడడమే తప్ప అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. పనులు, పదవులు, పథకాలు అమ్ముకున్న వారు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారని అలాంటి వాళ్ళను నమ్మితే మనం ఆగం అవుతామని సూచించారు.

మున్సిపాలిటీ(Municipality) అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ సహకారం కావాలని కావున మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీని గెలిపించా లని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, ఆర్డివో వెంకన్న మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : Asis Mega Bush fires :   ఆగదు..ఈ  కార్చిచ్చు Andhra Prabha News

CLICK HERE TO READ MORE :