సీఎం పర్యటించే హెలిప్యాడ్ స్థల పరిశీలన

సీఎం పర్యటించే హెలిప్యాడ్ స్థల పరిశీలన

నరసన్న పేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16 వ తేదీన జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో నరసన్న పేట సమీపంలోని జమ్మూ, తమరా పల్లి ప్రాంతాల వద్ద ప్రతిపాదిత స్థలాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థల అనుకూలతలపై అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్ స్థల విస్తీర్ణం మ్యాప్ ద్వారా నిశితంగా పరిశీలించారు.

వాహనాల పార్కింగ్, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం, తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్ స్థల మైదానాన్ని చదును, శుభ్రపరచే పనులు త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రెవిన్యూ డివిజనల్ అధికారి వేణుగోపాలరావు, రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారి తిరుపతిరావు, తాసిల్దార్ సత్యనారాయణ, డి.ఎస్.పి లక్ష్మణరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్లు గణేష్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply