జుక్కల్ మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని,జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యపరిరక్షణ కోసం ప్రతిఒక్కరు పాటుపడాలని,పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడడటమే కాకుండా,పోలియో నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావాలన్నారు.ప్రతి తల్లిదండ్రులు ఐదు సంవత్సరాలు లోపు తమ చిన్నారులందరికీ
పోలియో చుక్కలను వేయించాలన్నారు.