విశ్వ విజేతకు శుభాకాంక్షలు….

విశ్వ విజేతకు శుభాకాంక్షలు….
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : వరుసగా రెండు వరల్డ్ కప్ విజయాలతో.. టీమ్ ఇండియా చరిత్రలో నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. చరిత్రను తిరగరాస్తూ.. సొంత గడ్డపై పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టుగా నిలచిన భారత క్రికెట్ టీమ్ సభ్యులకు, కోచింగ్, సపోర్టింగ్ స్టాప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. న్యూజిలాండ్‌పై అద్భుతంగా గెలిచి కప్ సాధించిందనీ కితాబిచ్చారు.
భారతీయ క్రికెట్ అభిమానులందరి మనసుల్లో ఉల్లాసం నిండిన ఈ రోజు.. మొత్తం జట్టు అసాధారణమైన, అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించిందని తెలిపారు. ప్రతీ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన ఇస్తూ.. టోర్నీ ఆరంభం మొదలు ఆఖరి ఘట్టం వరకు పర్ఫెక్ట్ టేక్-ఆఫ్, ల్యాండింగ్ చేసి కప్‌ను కైవసం చేసుకుందని అన్నారు.
తాజా విజయంతో భారతీయ క్రికెట్‌కు ఒక కొత్త యుగం ప్రారంభమైందని స్పష్టం చేశారు. భారతదేశంలో క్రికెట్ కు ఓ ప్రత్యేక స్థానం ఉందని… విశ్వవిజేతగా నిలచిన జట్టులో సభ్యులు నేటి యువతను ప్రేరణగా నిలుస్తారని అన్నారు. అన్ని రంగాల్లో భారత ఆధిపత్యం ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు.
