రోటరీ క్లబ్ జెమ్స్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం..
రోటరీ క్లబ్ జెమ్స్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం..
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో నిర్వహించిన పల్స్ పోలియో డ్రైవ్లో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సమాజాన్ని పోలియో రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు తమ వంతు బాధ్యతగా సేవలందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ప్రెసిడెంట్ నరసింహారావు, సెక్రటరీ గంజి రమేష్ లతో పాటు క్లబ్ సభ్యులు రంజిత్ సింగ్, గౌరీ శంకర్, గిరీష్ కుమార్, మరియు కోటగిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరపున ఇలాంటి అనేక సామాజిక, ఆరోగ్య సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.
