చేనేత కార్మికునికి సన్మానం
చెన్నూర్, ఆంధ్రప్రభ : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కేంద్ర పట్టు పరిశ్రమల బోర్డు అధికారులు స్థానిక చేనేత కార్మికుడు నారాయణను ఘనంగా సన్మానించారు.
స్థానిక చేనేత పారిశ్రామిక సహకార సంఘాన్ని కేంద్ర పట్టు పరిశ్రమల బోర్డు శాస్త్రవేత్త, సంయుక్త సంచాలకుడు డాక్టర్ కె.పి. కిరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తసర్ పట్టు దారాన్ని ఉపయోగించి మరిన్ని విలువ ఆధారిత వస్త్రాలను తయారు చేసేందుకు ఉన్న అవకాశాలపై కార్మికులతో చర్చించారు. ఈ రంగంలో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
