Schemes | ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Schemes | ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
Schemes | జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంజూరు చేయగా ఇవాళ జైనూర్ ఎంపీడీవో కార్యాలయంలో జై నూర్ సిర్పూర్ మండలాలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
నిరుపేదల కోసం మంజూరు అవుతున్న పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు మంజూరు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జై నూర్ మండలానికి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు చెందిన ఒక వంద పదిహేను చెక్కులను సిరిపూర్ మండలానికి మంజూరైన 55 చెక్కులను ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెట్ల విశ్వనాథ్ రావు, సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుడి మీద విశ్వనాథరావు, ఆసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, జైనూర్ మాజీ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, జై నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, జైనూర్ మండల సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు మడవి భీమ్రావు, జైనూర్ ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు భగవంతరావు, జై నూర్ తాసిల్దార్ ఆడబీర్షావ్, జై నూర్ సిర్పూర్ యు డిప్యూటీ తాసిల్దారులు చిత్రు, మోహన్, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, నూతన మడవి సోంబాయి భీమ్రావు, ఆత్రం తులసి శంకర్, కుమ్ర యశోద కేశవ్ రావ్,జాదవ్ బాహు రావు, రాథోడ్ శ్రవణ్, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంతియాజులాల, నాయకులు ముండే సతీష్, కేంద్రీయ విశాల్ మిశ్రం శ్రీకాంత్ కనక రామ్ జి జాటోత్ రాహుల్, ఉద్యోగులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
