ఉదారత చాటిన మున్యాల జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : మండలంలోని మున్యాల జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉదారత చాటుకుంది. మున్యాల తండాకు చెందిన విద్యార్థిని భూక్యా విజయకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.

జూన్‌ నెలలో విజయ తండ్రి మృతి చెందడంతో ఆమె చదువుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయులు బాసటగా నిలిచారు. గత సంవత్సరం పాఠశాలలో పదో తరగతి చదివి ఉత్తమ మార్కులు సాధించిన విజయకు ఈ ఆర్థిక సహాయం అందించారు.

విద్యార్థిని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. విద్యార్థుల చదువుకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వామన్‌రావు, ఉపాధ్యాయులు మల్లేష్, భూమన్న, మల్లేష్, రాజేందర్‌రెడ్డి, వినోద్‌రాజ్, సుగుణాకర్, నాగరాజు, రమాదేవి, పుష్పలత, నవీన్ తదితరులు పాల్గొన్నారు.