ఇంటర్ ఫలితాల్లో మెరిసిన గుట్టే తులసి
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన గుట్టే తులసి
జైనూర్, (ఆంధ్రప్రభ): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన గుట్టే లక్ష్మణ్, తారతాయి దంపతుల కుమార్తె గుట్టే తులసి ఇంటర్‌మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి ప్రతిభ కనబరిచింది.
హైదరాబాద్‌లోని అవినాష్ కళాశాలలో చదువుతున్న తులసి, 500 మార్కులకు గాను 495 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు పొందింది. తమ కుమార్తె ఈ ఘనత సాధించడం ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు తెలిపారు.
గుట్టే తులసి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం పట్ల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
