చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే సహించను..

చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే సహించను..

జేసీబీలకు అడ్డుగా నిలుస్తా : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని 29, 30 వార్డులలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బజార్ ఏరియాలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారుల నుంచి ప్రచారానికి భారీ స్పందన లభించింది. రోడ్డు విస్తరణ పేరుతో కాంటా చౌరస్తా వరకు చిరు వ్యాపారాలు కోల్పోయిన వ్యాపారులకు ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. చిరు వ్యాపారుల కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమైందన్నారు.

వ్యాపారులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే.. జే సీ బీ లకు అడ్డంగా నిలిచి చిరు వ్యాపారులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. బెల్లంపల్లి బజార్ ఏరియాలో విస్తరణ కూల్చివేతలకు ప్రయత్నిస్తే తానే ముందుండి అడ్డుకుంటానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. సుబ్బండ వర్గాలకు అండగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతుగా ఉండి, ఈ ఎన్నికల్లో 34 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో 29వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రాజు లాల్ యాదవ్, 30వ వార్డ్ అభ్యర్థి షమీం ఖలీల్ పలువురు కార్యకర్తలు, వ్యాపారులు పాల్గొన్నారు.

Leave a Reply