శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు

శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు

  • మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం తొలగిపోవాలని, ప్రజలంతా ఏకమై శాంతి, సౌభ్రాతృత్వంతో జీవించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఆయన ఈ మేరకు ప్రార్థనలు చేశారు.

ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన గండ్ర వెంకట రమణారెడ్డి, వారికి ఆలయ్-బలాయ్ ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మైనారిటీల అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలను గుర్తుచేస్తూ, మైనారిటీ పాఠశాలల ద్వారా ఉచిత విద్య అందించడం వారి అభివృద్ధికి దోహదపడిందన్నారు.

మైనారిటీల సంక్షేమానికి ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడని కొనియాడారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ వాతావరణం నెలకొనడం బాధాకరమని పేర్కొంటూ, అల్లా దయతో ఈ పరిస్థితులు తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఏకత్వంలో భిన్నత్వం సూత్రాన్ని పాటిస్తూ ప్రజలంతా కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply