వడదెబ్బకు గురై వ్యక్తి మృతి
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సోమేశ్వర ఆలయం వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తున్న బండపల్లి పండు( 40) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. పండు మృతి పట్ల గ్రామానికి చెందిన పలువురు బుధవారం సంతాపం తెలిపారు.