ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఘన సన్మానం..
మోత్కూర్, ఆంధ్రప్రభ : భువనగిరి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మోత్కూర్‌కు చెందిన యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు కందుల విక్రాంత్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు దొంతోజు అశోక్ చారి కూడా పాల్గొన్నారు.
