ఘనంగా మే డే ఉత్సవాలు..

ఘనంగా మే డే ఉత్సవాలు..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా మండలంలోని వెంకట్రావుపల్లిలో హమాలి యూనియన్ అధ్యక్షుడు కాసాని కొమురయ్య ఆధ్వర్యంలో కార్మిక జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ పెరుమాళ్ళ చంద్రకళ మొగిలి గౌడ్ మాట్లాడుతూ.. శ్రామిక, కర్షక, కార్మికుల రెక్కల కష్టం వెలకట్టలేనిది. వారి త్యాగం అసమానమైనది. తమ శ్రమతో దేశ ప్రగతికి బాటలు వేస్తున్న కార్మిక, కర్షక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply