విద్యార్థులను సన్మానించిన కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి
విద్యార్థులను సన్మానించిన కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి
వికారాబాద్, ఆంధ్రప్రభ : విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు.. తల్లిదండ్రులు కన్న కలలు సహకారం చేయడం కోసం ఉన్నత లక్ష్యంతో చదివి ముందుకు సాగాలని.. వికారాబాద్ మున్సిపల్ కొత్తరేపల్లి కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తిరేపల్లిలో పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన వారిని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్యామ్ రెడ్డి, నాయకులు యాదగిరి, నర్సింలు, బక్క యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సన్మానం పొందిన వారిలో విద్యార్థులు ఏ.సాయి ప్రకాష్ రెడ్డి, సిహెచ్ మల్లన్న, కే వంశీ, ఎండి సోయల్, ఆర్ సింధుజ, జె వైష్ణవి, సిహెచ్ దీప్తిక, బి. సింధుజ, జి మహేశ్వరి, పి. నికిత, ఎస్ శృతి, సిహెచ్ వైష్ణవి, తదితరులు ఉన్నారు.
