Future Cityలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Future Cityలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘ఫ్యూచర్ సిటీ’లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఎఫ్ సిడిఏ (FCDA – Future City Development Authority) భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆ తరువాత ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అధికారిక లోగో, వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
