లింగాపూర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…
కడెం, ఆంధ్రప్రభ ; నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు, కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లింగంపెల్లి లక్ష్మికి 20వేల 500 రూపాయలు మరియు భూక్యా రాంజీ నాయక్‌కు 20వేల 500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న అందజేశారు.
ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రజా ప్రభుత్వమని అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఆకుల లచ్చన్న, ముస్కు రాజు, గోసుకుల మల్లేష్, రాహుల్ గాంధి పాలోవర్ ప్రాంట్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, నారాయణ, తారీ శంకర్, భూమన్న, సలీమ్, చెంద్రశేఖర్, దుర్గం రాజేష్, నరేష్, ప్రసాద్, నలేం శీను, రమేష్ గౌడ్, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
