డయాగ్నోస్టిక్ వాహనంపై ఇంకా కేసీఆర్ ఫొటో..
మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సంచార మారుతీ వాహనంపై ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిరోజూ జిల్లాలో తిరుగుతున్న ఈ డయాగ్నోస్టిక్స్ వాహనంపై ఇప్పటికీ కేసీఆర్ ఫొటో ఉండటాన్ని గమనించిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి ఫొటో స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
