ఘనంగా శ్రీ మెట్లబావి ధన మైసమ్మ తృతీయ వార్షికోత్సవాలు

ఘనంగా శ్రీ మెట్లబావి ధన మైసమ్మ తృతీయ వార్షికోత్సవాలు

  • 20, 21 తేదీల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, శోభాయాత్ర

కరీమాబాద్, ఆంధ్రప్రభ : 34వ డివిజన్ శివనగర్‌లోని శ్రీ మెట్లబావి ధన మైసమ్మ అమ్మవారి తృతీయ వార్షికోత్సవాలను ఈ నెల 20, 21 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తోట బాబన్న తెలిపారు.

ఈ సందర్భంగా జూన్ 20 శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాతం, ఉదయం 6 గంటలకు యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, గణపతి పూజ, అంకురార్పణ, క్షేత్రపాలక ఆరాధన, సర్వతోభద్ర మండలి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు సహస్ర కలశాలతో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, దర్శన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

జూన్ 21 ఆదివారం ఉదయం 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు చండీ హోమం, ఉదయం 9 గంటలకు సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నప్రసాద వితరణ, మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తారు.

అదే రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ ధన మైసమ్మ అమ్మవారి కటాక్షానికి పాత్రులు కావాలని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తోట బాబన్నతో పాటు కమిటీ కార్యవర్గ సభ్యులు కోరారు.