జోరుగా ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. క్లస్టర్ ఇన్చార్జి యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బూత్ ఇన్చార్జిలు, కమిటీ సభ్యులు, కేఎస్ఎస్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని ప్రచారంలో భాగంగా ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పత్సవ మల్లికార్జున, బూత్ ఇన్చార్జిలు బిందు, మొవ్వ విజయ, ప్రసాద్, బ్రహ్మారెడ్డి, శ్యాము, యూనిట్ ఇన్చార్జి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
