NEET UG | అభ్యర్థుల పిటిషన్ కొట్టివేత

NEET UG | అభ్యర్థుల పిటిషన్ కొట్టివేత

NEET UG | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్ నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జూన్‌ 21న నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

నీట్‌ రీ-ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని, నిలిపివేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పరీక్ష నిర్వహణను అడ్డుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

కోర్టు తాజా నిర్ణయంతో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్‌ 21న నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్ నిర్వహించనుంది. దీంతో పరీక్ష రాయనున్న అభ్యర్థుల్లో అనిశ్చితికి తెరపడింది.