సింగ‌రేణి వ‌ర్క్‌షాప్‌లో దుర్గామాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు

సింగ‌రేణి వ‌ర్క్‌షాప్‌లో దుర్గామాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు

గోదావరిఖనిన‌, ఆంధ్ర‌ప్ర‌భ : శక్తి స్వరూపిణి దుర్గాదేవి(Goddess Durga) అమ్మవారి కృపా కటాక్షం రామగుండం ప్రజలపై ఉండాలని శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్(Raj Thakur McCann Singh) కోరారు.

ఈ రోజు గోదావరిఖని ఏరియాలోని సింగరేణి ఏరియా వర్క్ షాప్ వద్ద నున్నదుర్గాదేవి ఆలయం వద్ద రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్, జీఎం లలిత్ కుమార్(GM Lalit Kumar) ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ఆలయం వద్ద ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పూజలు చేపట్టారు. రామగుండం(Ramagundam) పారిశ్రామిక నగరాన్నిఅన్నిరంగాల్లో సమృద్ధిగా అభివృద్ధి చేసేందుకు శక్తిని ప్రసాదించాలని వేడుకున్నారు.

బొగ్గు గని కార్మికుల, కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. అమ్మవారి కటాక్షం ఉంటే ఈ ప్రాంతాన్నిఊహించని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం -1 డిప్యూటీ సీఎం జితేందర్ సింగ్(Deputy CM Jitender Singh), సీనియర్ నాయకులు మహంకాళి స్వామి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply