పీఎం నరేంద్ర మోడీ12 ఏళ్ల పాలనలో స్వర్ణయుగం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ: భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత దిశగా అపూర్వ ప్రగతి సాధించిందని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుమన్ రాథోడ్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనకు 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం ఉట్నూర్‌లోని సార్వజనిక్ హనుమాన్ మందిరంలో బీజేపీ నాయకులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి దేశాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రార్థించినట్లు తెలిపారు.
మోదీ సేవ, సుశాసనం, సంకల్పానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్న ఆమె, గత 12 ఏళ్లలో దేశ భద్రత నుంచి మౌలిక వసతుల అభివృద్ధి వరకు, పేదల సంక్షేమం నుంచి అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్ఠ పెంపు వరకు ప్రతి రంగంలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. “వికసిత్ భారత్–2047” లక్ష్య సాధనకు బలమైన పునాదులు వేసిన నాయకుడిగా మోదీ నిలిచారని కొనియాడారు.
సనాతన భారతీయ విలువలను పరిరక్షిస్తూ నవ భారత నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న ప్రధాని మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, కాల్వ రవి, తన్నీరు సతీష్, మడవి రేఖ, రాథోడ్ సుశీల, సానా గోపి, చింతల రమణ, బుగ్గ విజయ్, రామగిరి వేణు, కనక విజయ్, చింతల భీమన్న, బింగి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
