Modi Record | నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ
Modi Record | నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ
Modi Record | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన నాయకుడిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును మోదీ అధిగమించారు. 2026 జూన్ 10 నాటికి మోదీ ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని కొత్త రికార్డు సృష్టించారు.
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1952 తొలి సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానిగా 4,398 రోజులు కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగమించడంతో బీజేపీ, ఎన్డీఏ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ చారిత్రక ఘనత నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.
మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం ఆమోదించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి గౌరవించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మోదీ సాధించిన ఈ మైలురాయిని పురస్కరించుకుని ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, వరుసగా మూడు పర్యాయాలు దేశాన్ని నడిపిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నుంచి జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన మోదీ, ఇప్పుడు ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన నాయకుడిగా చరిత్రలో నిలిచారు.
