మళ్లీ రోడ్డెక్కిన గ్యాస్ వివియోగదారులు..

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : వంట గ్యాస్ కృత్రిమ కొరతను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఖాళీ సిలిండర్లతో శనివారం తెల్లవారు జామున వినియోగదారులు రాస్తారోకో నిర్వహించారు.ఓ వైపు పోలీసుల పహారా మధ్య దంతాలపల్లి మండలంలోని దాట్ల,పెద్దముప్పారం గ్రామాలకు గొడవలు జరగకుండా బుక్ చేసుకున్న వినియోగదారులకు పోలీసుల పహారా మధ్య పంపిణీ చేస్తున్నారు.

మిగతా గ్రామాల వారు మాకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు.దీంతో ఇటీవల వినియోగదారులు జాతీయ రహదారిని ముట్టడించిన సంఘటన మళ్లీ మరువక ముందే భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ మళ్ళీ చర్చనీయాంశంగా మారింది.ఇలా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు.బుకింగ్ చేసి పదిహేను రోజులు దాటినా సిలెండర్ ఇవ్వడం లేదని ఏజెన్సీ నిర్వహణ వైఫల్యంపై ప్రశ్నిస్తున్నారు.ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కొరత లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.