అక్రమంగా నిల్వచేసిన… 8గ్యాస్ సిలిండర్లు సీజ్
అక్రమంగా నిల్వచేసిన… 8గ్యాస్ సిలిండర్లు సీజ్
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రం రామ్ నగర్ కాలనీలో సరిగోమ్ముల నాగరాజ్, ఆనంద్, ఇంట్లో నిల్వ ఉంచిన ఎనిమిది గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ ,భాస్కర్ల రాజు, తెలిపారు. మంగళవారం, సివిల్ సప్లై, స్థానిక పోలీస్ అధికారుల సంయుక్త తనిఖీలో అక్రమంగా నిల్వచేసిన 8 గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీలో సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు, ఏ ఎస్ ఐ లు, మధుసూదన్, సమ్మిరెడ్డి, కానిస్టేబుల్ లాల్ సింగ్, , శ్రీనివాస్, హోంగార్డు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
