ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం..

ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం..

  • రూ 3.94 కోట్లతో టేకుమట్ల నవాబుపేట రోడ్డు..
  • పునరుద్ధరణ రోడ్డు ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్..

చిట్యాల, ఆంధ్రప్రభ : మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.రహదారులు, భవనముల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల రూ 3.94 కోట్లు నిదులతో, టేకుమట్ల నుండి నవాబుపేట వరకు 7 కిలోమీటర్లు రోడ్డు పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. దీంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రోడ్డును ప్రారంభించారు.

అధ్వానంగా గుంతల మయంలతో ఉన్న రోడ్డు టేకుమట్ల నుండి సోమనపల్లి వరకు డబల్ రోడ్డు అక్కడ నుండి నవాబుపేట వరకు సింగిల్ రోడ్డుపనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాపాల ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట సర్పంచ్ పర్లపల్లి రవి, నాయకులు గూట్ల తిరుపతి, పులి తిరుపతిరెడ్డి, కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి, సర్వ శరత్, తోట గట్టయ్య, లింగంపల్లి కిరణ్ రావు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply