Vemula Veeresham | జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న జర్నలిస్టులకు ఎమ్మెల్యే అభినందనలు

Vemula Veeresham | జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న జర్నలిస్టులకు ఎమ్మెల్యే అభినందనలు

  • టీయూడబ్ల్యూజే జిల్లా పదవులు పొందిన జర్నలిస్టులకు శుభాకాంక్షలు
  • క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల సత్కారం
  • ఏళ్ల బయ్యన్న, పెద్ది నరేందర్‌లకు శాలువాలతో సన్మానం
  • జర్నలిస్టుల సేవలు సమాజానికి ఎంతో కీలకం: ఎమ్మెల్యే వీరేశం

చిట్యాల, ఆంధ్రప్రభ: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) జిల్లా కమిటీలో పదవులు దక్కించుకున్న చిట్యాల ప్రాంత జర్నలిస్టులు ఏళ్ల బయ్యన్న, పెద్ది నరేందర్‌లను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం అభినందించారు. ఇటీవల నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా మహాసభలో ఏళ్ల బయ్యన్న జిల్లా ఉపాధ్యక్షుడిగా, పెద్ది నరేందర్ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం తన క్యాంపు కార్యాలయంలో వారిద్దరిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కొత్త బాధ్యతల్లో వారు మరింత సమర్థవంతంగా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెరుకు సతీష్, మెండే వెంకన్న, పోకల కరుణాకర్, చెరుపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply